'అమెరికాలో సూప‌ర్‌మ్యాన్‌... భార‌త్‌లో ప్యాడ్ మ్యాన్‌' అంటున్న అక్ష‌య్ కుమార్‌

15-12-2017 Fri 13:00 | Entertainment
  • ఆలోచింప‌జేస్తున్న 'ప్యాడ్ మ్యాన్' ట్రైల‌ర్‌
  • వాయిస్ ఓవ‌ర్ ఇచ్చిన బిగ్ బీ
  • జ‌న‌వ‌రి 26న విడుద‌ల‌
స‌మాజానికి ఉప‌యోగ‌ప‌డే చిత్రాల‌ను చేస్తున్న హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అక్ష‌య్ కుమార్‌.. మ‌రోసారి ఆలోచింప‌జేసే క‌థాంశంతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. మహిళలు రుతుక్ర‌మం గురించి మాట్లాడ‌టానికి ప‌డే సంకోచానికి కార‌ణాల‌ను, వారి స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారాల‌ను తెలియ‌జేస్తూ తెర‌కెక్కించిన `ప్యాడ్ మ్యాన్‌` చిత్ర ట్రైల‌ర్ విడుద‌లైంది.

ఆర్‌. బాల్కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో రాధికా ఆప్టే, సోన‌మ్ క‌పూర్‌లు న‌టించారు. ఈ చిత్ర ట్రైల‌ర్‌లో ‘అమెరికాలో సూపర్‌మ్యాన్‌, బ్యాట్‌మ్యాన్‌, స్పైడర్‌ మ్యాన్‌ ఉన్నారు. కానీ మన భారత్‌లో ప్యాడ్‌మ్యాన్‌ ఉన్నాడు’ అనే డైలాగ్ ఆలోచింప‌జేస్తోంది. అలాగే ఈ ట్రైల‌ర్‌కి బిగ్‌బీ అమితాబ్ బ‌చ్చ‌న్ ఇచ్చిన వాయిస్ ఓవ‌ర్ హైలైట్‌గా నిలిచింది. మ‌హిళ‌లు బ‌లంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుంద‌ని వ‌చ్చీ రాని ఆంగ్లంలో అక్ష‌య్ కుమార్ చెప్పిన డైలాగులు ఆక‌ట్టుకుంటున్నాయి.

ఈ చిత్రాన్ని అరుణాచలం మురుగనాథమ్‌ జీవితం ఆధారంగా తెరకెక్కించారు. తమిళనాడుకి చెందిన అరుణాచలం మురుగ‌నాథ‌మ్‌, సమాజంలో మహిళలు రుతుక్రమం సమయంలో ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించేందుకు శానిటరీ ప్యాడ్లు తయారుచేసి తక్కువ ధరకు లభించేలా కృషిచేశారు. ఈ చిత్రం 2018 జనవరి 26న విడుదలకానుంది.
pad manakshay kumarbig b

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more